శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (20:16 IST)

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు... తప్పిన పెను ప్రమాదం

బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సును నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ సుభానీ గుండెపోటుతో మృతి చెందాడు. మాచర్ల, పిడుగురాళ్ల మధ్యలో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దాచేపల్లి దగ్గర బస్సును ఆపివేసి డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. 
 
ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్‌ సుభానీ మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  బస్సు ముందు చక్రం విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.