గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:29 IST)

కరోనా సమయంలో కల్వరి సేవలు అమోఘం: ఎమ్మెల్యే కిలారి

పశువుల పాకలో జన్మించి లోకానికే ఆరాధ్యుడైన దయామయుడు, ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటిన కారుణామయుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్టమస్ అంటూ, రాష్ట్ర ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. 

 
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామంలో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ముఖ్య అతిథిగా పాలుపంచుకుని ప్రసంగించారు. దేవుని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నకల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీష్ సందేశం అద్భుతమన్నారు. ఆయన వాక్యం వినటం కోసం వివిధ జిల్లాల నుంచి వేలాదిమంది తరలి రావటం సామాన్యమైన విషయం కాదన్నారు. 
 
 
కరోనా కష్టకాలంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కల్వరి టెంపుల్ అందించిన సేవలు అమోఘం, అభినందనీయమని కొనియాడారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తూ, మరొక్కసారి వేదికపై నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.