శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (09:08 IST)

రొయ్యల చెరువు వద్ద ఘోరం : ఆరుగురి వ్యక్తుల సజీవదహనం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని రేపల్లె మండలం లంకెవానిదిబ్బలోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఒడిశాకు చెందిన కూలీలుగా గుర్తించారు. 
 
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రివేళ విద్యుదాఘాతం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం వారి మరణానికి షార్ట్‌సర్క్యూట్ ఎంతమాత్రమూ కారణం కాదని చెప్పడం అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది.
 
మరోవైపు, ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.