మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (15:44 IST)

వైకాపా మంత్రులంతా చంద్రబాబు ఇంటి చుట్టే చక్కర్లు : బచ్చుల అర్జునుడు

వైకాపా మంత్రులంతా తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి చుట్టే చక్కర్లు కొడుతున్నారనీ టీడీపీ నేత బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, వరద సహాయక చర్యలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 
 
కక్ష సాధింపుపై ఉన్నటువంటి శ్రద్ధ, వరదలో మునిగిపోయినటువంటి ప్రజలను రక్షించే విషయంలో లేదని ఆరోపించారు.
 మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ట్రాల్లో వరద గురించి ముందుగా చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 
కరకట్టపైన జీవం చేస్తున్నటువంటి అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. 
 
మంత్రులు చూస్తే చంద్రబాబు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునగలేదని మంత్రులు తిరగడమే సరిపోతుందన్నారు. మునిగిపోయినవంటి ఇళ్లకు పాతిక వేల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల పూర్తిగా నిండకుండానే కృష్ణకు నీటిని వదిలేయడం జరిగిందన్నారు. ఎక్కడ కూడా కాలవలోకి నీళ్లు వదలటం లేదన్నారు.

నీళ్లు వదిలినట్లయితే చెరువులో నీళ్ళు నిల్వ ఉంటాయన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల కలిగినటువంటి వరద తప్ప మరే ఇతర కారణాలు కావన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి ఇల్లు ఎప్పుడు మునిగి పోద్దా అని వేచి చూశారని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో చంద్రబాబు ఇంటికి చిత్రీకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. జెడ్ క్యాటగిరీ ఉన్నటువంటి చంద్రబాబుకి భద్రతను ఈ ప్రభుత్వం తొలగించిందని గుర్తుచేశారు. 
 
చంద్రబాబు హతమార్చాలని అన్న ఉద్దేశంతోనే భద్రతను తగ్గించారనీ, న్యాయ విచారణ జరిగితే అసలు విషయాలు బయటికి వస్తాయన్నారు. జగన్ ప్రభుత్వం కక్షలతో, కుతంత్రాలతో ముందుకెళ్తోందని, అన్న క్యాంటీన్‌లో కనీసం భోజనం చేసే వాళ్ళు అది కూడా లేకుండా మూసివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.