గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (07:28 IST)

24న కాంగ్రెస్ లోకి హర్షకుమార్

ఈ నెల 24వ తేదీన ఎపిసిసి ఇంచార్జ్ ఉమెన్ చాంది,  ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎంపి హర్షకుమార్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
 
రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి వైరస్ దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యులు హాజరయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇండోర్ సమావేశహాలులోనే చేరిక కార్యక్రమము జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎపిసిసి కార్యవర్గ సభ్యులు, తన అభిమానులు హాజరవుతారని తెలిపారు.