బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (09:23 IST)

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన్మోహన్?

రెండుమార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ కు పార్టీ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందా?.. ఈ మేరకు నిర్ణయం ఖరారైందా?.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రసక్తే లేదని సోనియా గాంధీ తెగేసి చెప్పడం, రాహుల్, ప్రియాంక కూడా విముఖత తెలపంతో ఆపద్బాంధవుడిగా పేరున్న మన్మోహన్ కే పట్టం కట్టాలని సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లేదా కేంద్ర మాజీ మంత్రి ఏకె. ఆంటోనీలలో ఒకర్ని అధ్యక్ష బాధ్యతలకు ఒప్పించాలని సీనియర్లు రాహుల్ కు సూచించారు.

రాహుల్ రాజీనామా చేసి, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టక మునుపు కూడా ఈ రెండు పేర్లే అధ్యక్ష బాధ్యతలకు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వీరిని ఒప్పించడానికి రాహుల్ సన్నిహితులు రంగంలోకి దిగారు.

సోమవారం కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే తదుపరి అధ్యక్షుడ్ని ఎంపిక చేసేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.