గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (18:25 IST)

పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాడు, బావిలో శవమై తేలాడు

విజయనగరం: విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో వైసీపీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదగా మృతి చెందాడు. ఊరి చివర బావిలో మృతదేహం లభ్యమవడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
మృతుడు పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి(22) గా గుర్తించారు స్థానికులు. ఇటీవల జరిగిన మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఊరిలోని వైసీపీ వర్గీయులు రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశారు. అయితే ఇందులో ఒక వర్గం గెలిచింది.
 
మృతుడు గెలిచిన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కుటుంభ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు దర్యాప్తు చేపడుతున్నారు.