గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (18:08 IST)

ఇంటింటికి గ్యాస్.. తిరుపతిలో భారీ పేలుడు

Gas line
Gas line
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికి గ్యాస్ సరఫరాకు సంబంధించి  ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ చేపట్టిన గ్యాస్ పైప్‌లైన్ అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. తిరుపతి జిల్లా నాయడు పేట మండలం మేనకూరు సెజ్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. 
 
పైప్ లైన్ నిర్మిస్తున్న క్రమంలోనే పేలుడు జరిగింది. దాంతో 35 అడుగుల మేర పైకి రాళ్లు, మట్టి పైకి లేచాయి. పెద్దశబ్దంతో పేలుడు సంభవించగా.. 5 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. పేలుడు జరిగింది రాత్రి సమయంలో కావడం, అందునా సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.