శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (20:05 IST)

సెల్ఫీలు దిగడానికే వచ్చాడా? బాలకృష్ణపై హిందూపురం ప్రజల ఫైర్

Nandamuri Balakrishna
నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం అనంతపురంలో ఓ టీడీపీ నాయకుడి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అనంతరం బెంగళూరు వెళ్తూ.. హడావుడిగా హిందూపురం పట్టణంలో వరద ముంపునకు గురైన ప్రాంతంలో పర్యటించారు.
 
మారుతీనగర్‌లో బాలకృష్ణ సెల్ఫీ ఫొటోలకే ప్రాధాన్యమిస్తూ.. తమ బాధలను పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళలు ఫైర్ అయ్యారు. 'మా బాధ చెప్పుకుందామంటే సెల్ఫీలు దిగుతున్నాడు. ఆయన ఇక్కడకు సెల్ఫీలు దిగడానికే వచ్చాడా?' అని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. 
 
దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు.. వారిని తీసుకెళ్లి బాలకృష్ణతో మాట్లాడించారు. మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన బాలకృష్ణ.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.