భారతదేశపు రియల్ సూపర్ హీరోస్‌ను సత్కరించిన జీస్క్వేర్ హౌసింగ్
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, అత్యున్నత అనుభవం కలిగిన ల్యాండ్ యాగ్రిగేటర్, ప్లాట్ ప్రొమోటర్ జీస్క్వేర్ హౌసింగ్ భారతదేశపు రియల్ సూపర్‌హీరోస్- దివ్యాంగులైన క్రీడాకారులను గౌరవిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జీస్క్వేర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అవార్డులను 2022 సంవత్సరానికిగానూ అందించింది. ఈ అవార్డు గ్రహీతలను మాదాపూర్‌లోని వెస్టిన్ హైదరాబాద్ హోటల్‌లో సుప్రసిద్ధ అతిథులు శ్రీ అనిల్ మిన్జ్, డీఐజీ జీసీ ఆర్‌ఆర్‌వై కమ్ డైరెక్టర్ ఎన్‌సీడీఈ; శ్రీ బి సాయి ప్రణీత్, భారతీయ బాడ్మింటన్ ప్లేయర్, శ్రీ ఈశ్వర్ ఎన్, సీఈఓ, జీస్క్వేర్ హౌసింగ్; టీ సంజీవయ్య, జనరల్ సెక్రటరీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణా సమక్షంలో అందజేశారు.
పారా ఒలింపిక్ అవార్డు గ్రహీతలకు జీస్క్వేర్ నగదు బహుమతులను (1 లక్ష, 75వేల రూపాయలు, 50వేల రూపాయలు) దేశంలోని పారా స్పోర్ట్స్ పర్సనాలిటీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేసింది. వీరు దేశీయ, అంతర్జాతీయ స్ధాయిలలో పోటీపడినవారు. శ్రీ అనిల్ మిన్జ్, డీఐజీ జీసీ ఆర్‌ఆర్‌వై కమ్ డైరెక్టర్ ఎన్‌సీడీఈ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాలుపంచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా రంగంలో దివ్యాంగులను గుర్తించేందుకు ఈ అవార్డులు అందజేశారు. ఈ విజేతలు నేడు బాహ్య ప్రపంచానికి ఆదర్శప్రాయులు. జీస్క్వేర్ ప్రారంభించిన మహోన్నత కార్యక్రమంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.
ఒలింపియన్, వరల్డ్ చాంఫియన్‌షిప్ బ్రాంజ్ మెడిలిస్ట్, ఇండియన్ బాడ్మింటన్ క్రీడాకారుడు బి సాయిప్రణీత్ మాట్లాడుతూ, ఈ మహ్నోత కార్యకమం, మరీ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా స్ఫూర్తిదాయక ప్రతిభావంతులను గుర్తించే కార్యక్రమంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఓ క్రీడాకారునిగా ఈ తరహా గుర్తింపు పొందడంలో ఎదురయ్యే సవాళ్లు గురించి నాకు బాగా అవగాహన ఉంది. ఈ విజేతలు, పార్టిస్పెంట్స్ అత్యుత్తమ ఉదాహరణగా నిలవడంతో పాటుగా ఇతరులకు ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రీడారంగంలో రాణించాలనే వారికి వీరు స్ఫూర్తిదాతలుగా నిలిచారు అని అన్నారు.
జీస్క్వేర్ హౌసింగ్ సీఈఓ శ్రీ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ, వింగ్స్ ఆఫ్ ఫైర్ అవార్డులును ఈ సంవత్సరం మా కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా జీస్క్వేర్ హౌసింగ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పారా స్పోర్ట్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటుగా భారతదేశంలో ప్రతిభావంతులైన పారా క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకుందిఅని అన్నారు.
చేయడం కంటే చెప్పడం చాలా సులభం. ఒకరి ప్రతికూలతను మరొకరి అవకాశంగా కూడా మారుతుంది. కానీ ఈ అద్భుతమైన వ్యక్తులు ఈ ప్రపంచానికి దివ్యాంగులైనప్పటికీ అద్భుతాన్ని సాధించగలమని వీరు నిరూపించారు. వారి బాధల నుంచి సమాజంగా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది మరియు జిజ్ఞాస, శక్తికి వందనాలనూ అర్పించాల్సి ఉంది. మేము వారి ప్రయత్నాలకు మద్దతు అందించడంతో పాటుగా వీలైనంతగా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాము. తద్వారా వారు మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలువనున్నారు. రాబోయే సంవత్సర కాలంలో 100 కు పైగా ఈ అర్హత కలిగిన అథ్లెట్స్‌ను స్పాన్సర్ చేయడానికి ప్రణాళిక చేశాము అని అన్నారు.