Vizianagaram: మహిళా పోలీసులకే రక్షణ కరువు.. జుట్టు పట్టి లాగి..? (video)
ఏపీ ప్రభుత్వం మహిళల గురించి లోతుగా ఆలోచిస్తోంది. వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీ పోలీస్ శాఖ మరో అడుగు ముందుకు వేసి, మహిళల రక్షణ కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి యాప్ తీసుకొచ్చింది. హోం మంత్రి వంగలపూడి అనిత దీని గురించి చెప్పారు. ఈ యాప్ ద్వారా మహిళలు పోలీసుల సహాయం త్వరగా పొందవచ్చునని వివరించారు.
అయితే ఏపీ రాష్ట్రంలో మహిళా పోలీసులకే రక్షణ కరువైంది. గుడివాడ గ్రామ జాతరలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మహిళా ఎస్సై దేవిని జుట్టు పట్టి లాగటమే కాకుండా ఆమెపై అభ్యంతరకరమైన భాషతో తిట్టడం చేశారు. దీంతో జడుసుకున్న మహిళా ఎస్సై ఆ ప్రాంతం నుంచి భయంతో పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.