అతిసారం బాధితులకు పవన్ రూ. 10 లక్షల సాయం: అద్భుత నాయకుడు అంటూ ప్రశంస
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసారం బారిన పడిన కుటుంబాలను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఆయన మృతి చెందిన వారి కుటుంబాలకు తన సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పది కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ప్రభుత్వం తరపున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాయం అందేట్లు ప్రయత్నం చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ అక్కడికక్కడే సాయం ప్రకటించడం పట్ల సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమస్యల గురించి మాట్లాడి ఇతర పార్టీలను విమర్శిస్తూ ఒక్క పైసా సాయం చేయనివారిని ఇప్పటివరకూ చూస్తూ వస్తున్నామనీ, మొదటిసారిగా సమస్య వుంటే వెంటనే స్పందించి సహాయం చేసే నాయకుడు పవన్ కల్యాణ్‌ను చూస్తున్నామంటూ ప్రశంసిస్తున్నారు అక్కడి ప్రజలు.