మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (13:30 IST)

ఎన్నికలయ్యే దాకా ఇళ్ల స్థలాలు ఆపాల్సిందే... తేల్చి చెప్పిన ఈసీ

స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే దాకా ఇళ్ల స్థలాల ప్రక్రియ నిలిపేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్  స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు సాధారణ ఎన్నికలు 2020లో  మోడల్ ప్రవర్తనా నియమావళి మార్చి 7వ తేదీ నుండి అమల్లోకి రావడం జరిగిందని రమేష్ కుమార్ శనివారం ప్రకటన విడుదల చేశారు.

7 నుండి రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి మొత్తం రాష్ట్రంలో 7 నుండి అమల్లోకి వచ్చిందని, మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విలేకరుల సమావేశాలలో స్పష్టీకరణ చెయ్యడం జరిగిందన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న లబ్ధిదారుల ఆధారిత కార్యక్రమం అయిన ఇళ్ల స్థలాలు పంపిణీని మోడల్ ప్రవర్తనా నియమావళి క్రింద అనుమతించలేమన్నారు. ఈ విషయంపై హైకోర్టులో, గృహ స్థలాల పంపిణీని ఆపడానికి కొన్ని కేసులు దాఖలు చేయబడ్డాయన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ అంశాలన్నింటిని  గమనించి మోడల్ ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశామన్నారు.

న్యాయస్థానం అభిప్రాయపడిన వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, గృహ స్థలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి టెండర్లను పిలవడం, టోకెన్ల పంపిణీ మొదలైన వాటితో సహా ఇంటి సైట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వెంటనే నిలుపుదల చెయ్యలన్నారు.

లబ్ధిదారులను ఎన్నుకోవటానికి,  గృహ స్థలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పనులతో వ్యవహరించే రెవెన్యూ మరియు ఇతర విభాగాల అధికారులు ఎవ్వరూ అందులో భాగస్వామ్యం అవ్వకూడదన్నారు. అధికారులు అందరూ ఎన్నికలను సజావుగా పూర్తి అయ్యే వరకు ఎన్నికల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.

అందరూ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు మరియు పరిశీలకులు మరియు మొత్తం ఎన్నికల యంత్రాంగాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నామని రమేష్ కుమార్ తెలిపారు.