సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (15:18 IST)

యూపీలో వింత .. వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వేప చెట్టు నుంచి తియ్యటి పాలు ధారగా కారుతున్నాయి. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వేప చెట్టు నుంచి తియ్యటి పాలు ధారగా కారుతున్నాయి. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. పైగా, ఈ పాలు తాగితే దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయని ప్రచారం సాగడంతో ఆ చెట్టున్న ప్రాంతమంతా ఇప్పుడో చిన్నపాటి పుణ్యక్షేత్రమైంది.
 
ఆగ్రాకు సమీపంలోని ఫిరోజాబాద్‌లోని నసీర్ పూర్ సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి చిక్కగా పాల వంటి ద్రవం కారుతోంది. ఇది సర్వరోగాలనూ హరించే ద్రవమని నమ్ముతున్న ప్రజలు, తండోపతండాలుగా వస్తున్నారు. పాలు పట్టుకుని వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతమంతా భజనలు మారుమ్రోగుతుండగా, వందలాది మంది ఇది దేవుని మహిమేనంటూ, చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.