శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (12:10 IST)

బెయిలు రాదనీ మేకులు మింగాడు.. ఎక్కడ?

హైదరాబాద్‌ నగరంలోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్న పాత నేరస్తుడు ఒకడు బెయిలు రాదన్న ఆందోళనలో మేకులు మింగేశాడు. దీంతో ఆ ఖైదీని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించేందుకు వైద్యులతో పాటు.. పోలీసులు నానా ప్రయాసలు పడాల్సివచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళ్‌హాట్ జాలీ హనుమాన్ ప్రాంతానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి ఓ కేసులో హబీబ్‌నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గతకొన్ని రోజులుగా పోలీసుల కస్టడీలోనే ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తనకు ఇక బెయిల్ రాదన్న ఆందోళనకు గురై ఇనుప మేకులు మింగేశాడు. వెంటనే పోలీసులు రమేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తలించారు. అక్కడ రమేశ్.. తనకు బెయిల్ మంజూరు చేస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని మెండికేశాడు. 
 
దీంతో పోలీసులు రమేశ్‌ను రిమాండ్‌కు తరలించగా, రమేశ్‌కు మింగిన మేకులను తొలగించాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో వైద్యులు రమేశ్‌కు ఆపరేషన్ నిర్వహించి మేకులను తొలిగించారు.