వలపు వలతో మన్మథ బాణం.. ఎంజాయ్ చేశాక యూత్‌కు బ్లాక్ మెయిల్
ఇటీవలి కాలంలో అమ్మాలు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. 20 యేళ్ల లోపు యువకులకు వలపు వల విసిరి వారిని ట్రాప్ చేస్తున్నారు. తమలో వలలో పడిన తర్వాత వారి డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పలువురు కిలాడీ లేడీల బాగోతం వెలుగు చూసింది. తాజాగా ఓ బాధితుడి తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో కిలాడీ లేడీ బండారం బయట పడింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నగరంలోని కుషాయిగూడ పరిధిలో నివాసముంటోంది. ఈజీ మనీకి అలవాటు పడిన ఆమె 17-20 ఏళ్ల యువకులను టార్గెట్ చేసుకుని వలపు వల విసిరి లొంగదీసుకునేది.
తర్వాత డబ్బులు కావాలంటూ అందినకాడికి దోచుకునేది. ఇవ్వకుంటే యువకులను కేసులు పెడతానని బెదిరించేది. పలువురు యువకులను జైలుకి కూడా పంపించిందని ఓ బాధితుడి తండ్రి ఆరోపించారు.
సెక్స్ రాకెట్ నడుపుతూ తన కొడుకు వద్ద నుంచి డబ్బులు గుంజుతోందని పలుమార్లు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడి తండ్రి చెప్పారు.
చివరికి న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. బాధితుడి ఆవేదన విన్న కమిషన్ నవంబర్ పదో తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.