శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 ఆగస్టు 2022 (14:58 IST)

పవన్ ఛాలెంజ్ విసిరారని చేనేత చొక్కా వేసుకుంటే జనసేనలోకి వెళ్లిపోతానంటారా? బాలినేని

balineni srinivas reddy
ఇటీవలే చేనేతపై తెలంగాణ మంత్రి కేటీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ స్వీకరించిన పవన్ చేనేత దుస్తులు ధరించి తనవైపు నుంచి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఛాలెంజ్ విసిరారు. బాలినేని వెంటనే స్పందించి చేనేత దుస్తులను ధరించి ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఇంతవరకూ బాగానే వుంది.

 
బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీ మారేందుకు మంతనాలు జరుపుతున్నారనీ, జనసేనలోకి వెళ్లేందుకు పార్టీ  కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. చేనేతల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే మద్దతిచ్చానని అంతకుమించి ఏమీలేదని అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అనీ, ఎన్ని కష్టనష్టాలను వచ్చినా వైసిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.