సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (15:39 IST)

రజినీకాంత్ బలమైన నాయకుడవుతారని అనుకుంటున్నా (video)

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్నది ఇప్పటి విషయం కాదనీ, తను సినిమాల్లోకి ప్రేవిశించక ముందే నుంచే జరుగుతున్న చర్చ అని చెప్పారు. గతంలో ఆయన డీఎంకెకి మద్దతు పలికి ఆ పార్టీని గెలిపించాలని కూడా కోరారని గుర్తు చేసారు.
 
రజినీకాంత్ గారికి తమిళనాడులో బలమైన అభిమాన సంఘాలున్నాయనీ, ఆయన మంచి నాయకుడవుతారన్న విశ్వాసం తనకు వుందన్నారు. రాజకీయాల్లోకి మంచివారు వస్తున్నప్పుడు స్వాగతించాల్సిందేనని చెప్పారు.