వచ్చేస్తున్నా.. కాస్కోండి.. జనవరిలో రజినీకాంత్ కొత్త పార్టీ!

rajinikanth
ఠాగూర్| Last Updated: గురువారం, 3 డిశెంబరు 2020 (13:14 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన రాజకీయ అరంగేంట్రంపై ఆయన ఓక్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేది కాస్త ఆలస్యమైనప్పటికీ.. వచ్చేది మాత్రం పక్కా అంటూ తేల్చి చెప్పారు. జనవరిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై డిసెంబరు 31వ తేదీన ఓ ప్రకటన చేస్తానని ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

దీంతో ఎన్నో యేళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఆయన రాజకీయ ప్రవేశంపై ఉన్న సందేహాలు పటాపంచలైపోయాయి. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. రజనీ ట్వీట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, తన రాజకీయ ప్రవేశం, కొత్త పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ ఇటీవలే తన అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. చెన్నై కోడంబాక్కంలోని తన సొంత కళ్యాణ మండపంలో ఈ చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత ఓ నిర్ణయానికి వచ్చి.. ఇపుడు తన కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.దీనిపై మరింత చదవండి :