గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 27 సెప్టెంబరు 2021 (12:45 IST)

ఇబ్ర‌హీంప‌ట్నం ఎంపిపి పాల‌డుగు జ్యోత్న్స కు ఘన సన్మానం

విజ‌య‌వాడ‌కు స‌మీపంలో ఉండి, రాజ‌కీయంగా ఎంతో ప్రాముఖ్యాన్ని పొందిన ఇబ్ర‌హీం ప‌ట్నం మండల అధ్య‌క్షురాలిగా వైసీపీ నేత పాలడుగు జ్యోత్న్స అధికార పీఠాన్ని అలంక‌రించారు. ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధికి  కట్టుబడి పని చేస్తానని కొత్త ఎంపిపి హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంతో పాటు కొండపల్లి మున్సిపాలిటీ లో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని పాలడుగు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. 
 
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ ప్రెసిడెంట్ గా భాద్యతలు చేపట్టిన పాలడుగు జ్యోత్స్న ను మర్యాద పూర్వకంగా కలిసిన కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ యువజన విభాగం నాయకులు, క్యాపో సొసైటీ  అధ్యక్షుడు మొగిలి దయ నూతన ఎంపిపి దంప‌తుల‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిపి పాలడుగు జ్యోత్స్న మాట్లాడుతూ, మండల పరిధిలోని అన్ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని హామీ ఇచ్చారు.
 
అనంతరం వైసీపీ నాయకులు పాలడుగు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం మండలం తో పాటు కొండపల్లి మున్సిపాలిటీ లో వైసీపీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.  ప్రస్తుత రాజకీయాలలో యువత కీలక పాత్ర పోషించాలని కొండపల్లి మున్సిపాలిటీలో దయ సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమం లో  కొండపల్లి క్యాపొ సొసైటీ సభ్యులు, వైసీపీ యువజన విభాగం నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.