1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 మే 2020 (10:53 IST)

మద్యం దుకాణాల వద్ద గూమిగూడితే మూతే

గుంటూరుజిల్లాలోని 20 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న 59 క్లస్టర్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

కేవలం వాటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం లోపు ఉండే బఫర్‌ ఏరియాల్లో మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చామన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కరోనా కేసులున్న ప్రాంతం నుంచి అర కిలోమీటర్‌ వరకు ఉన్న కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లు కారణంగా 280 మద్యం దుకాణాలకు 134కి మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. మద్యం దుకాణాల వద్ద గూమిగూడితే వాటిని మూసి వేస్తామన్నారు.
 
 
బఫర్‌ జోన్లలో ట్యాక్సీలో ఒకరు ప్రయాణించవచ్చన్నారు. దుకాణాలకు, పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతులు ఇస్తామన్నారు.

నిర్మాణం రంగానికి సంబంధించి స్థానిక కూలీలనే పెట్టుకోవాలన్నారు. అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ గత నెలన్నర నుంచి ఏవైతే ఆంక్షలు అమలులో ఉన్నాయో అవన్నీ గుంటూరు అర్బన్‌ ఏరియాలో కొనసాగుతాయన్నారు. 
 
ప్రత్తిపాడు, పెదవడ్లపూడిలో మద్యం షాపులకు ఇతర ప్రాంతాల వారు వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం గుంటూరు, చిలకలూరిపేట ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

అత్యవసర పాస్‌లను దుర్వినియోగం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరుకు వచ్చేందుకు ఇప్పటి వరకు 9,492 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని వారు అక్కడ ఏ జోన్లో ఉంటారు.

ఇక్కడకు వస్తే ఏ జోన్లో ఉంటారో పరిశీలించి అనుమతించడం జరుగుతుందన్నారు. ఇతర రాష్ర్టాలకు వెళ్ళదలచిన వారు,అక్కడ నుంచి రాదలచిన వారు స్పందన వెబ్ సైట్ లో ధరకాస్తు చేసుకోవాలని,లేదంటే 1902 కు ఫోన్ చేయాలన్నారు.ఈ రెండు వీలుకాకపోతే స్థానిక తహసీల్దార్ ని సంప్రదించాలని సూచించారు.