శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (13:05 IST)

జగనన్న గోరుముద్ద వికటించి.. 36మంది విద్యార్థుల అస్వస్థత

Pudina
ఏలూరు జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 36మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో శనివారం మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 36 మంది విద్యార్థులు అస్వస్థత కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కుచింపూడిలోని జిల్లా పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉపాధ్యాయులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 
 
విద్యార్థినులు తిన్న ఆహారాన్ని విశాఖపట్నంలోని ల్యాబ్‌కు పంపించే దిశగా చర్యలు తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం పుదీనా రైస్ తీసుకోవడం ద్వారానే ఈ విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 
 
పుదీనా, కొత్తిమీర ఎక్కువ పరిమాణాల్లో వేయడంతో ఈ సమస్య వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.