బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (12:16 IST)

ఏలూరులో మట్టికుండలో గుప్తనిధి.. 18 బంగారు నాణేలు

gold coins
ఏలూరులోని కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో మట్టి కుండలో గుప్త నిధి లభ్యం కావడం సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. పామాయిల్ ఫారంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు పైప్‌లైన్ వేయడానికి తవ్వుతుండగా మట్టి కుండను కనుగొన్నారు. కూలీలు, పొలం యజమానికి 18 బంగారు నాణేలు లభించాయి. ఈ ఘటన నవంబర్ 29న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పొలం యజమాని నుంచి సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బంగారు నాణేలను సేకరించారు. ఒక్కో బంగారు నాణెం 8 గ్రాముల పైనే ఉంటుందని, అది 2వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.