గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (10:08 IST)

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.18 కోట్ల నగదు స్వాధీనం

malla reddy
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరంతా వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మరోవైపు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేయడం ఇపుడు సంచలంగా నారింది. మొత్తం రూ.18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర అగ్రహంతో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెరాసను దెబ్బతీసేందుకే తమపై ఐటీ సోదాలు చేయించారని ఆరోపిచారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సోదాలు జీవిత చరిత్రలో ఎన్నడూ చూడలేదని చెప్పారు.