మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (09:23 IST)

కుల మతాలకు అతీతంగా పథకాల అమలు.. మంత్రి ఆదిమూలపు సురేష్

విజయవాడ హోటల్ ఐలాపురం లో ఎస్ సీ, ఎస్ టి, బి.సి, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలోని సామజిక సాధికారత కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సురేష్ మాట్లాడుతూ... బడుగుల కోసం జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్న పధకాలు వచ్చిన విషయం గమనించాలన్నారు.

కులాలకు, మతాలకు అతీతంగా పధకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్య విషయంలో పేదలకు సహాయ పడేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నవో అన్ని పరిసీలించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల కోసమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే విదంగా దళితులు వ్యాపార రంగం వైపు కూడా ద్రుష్టి సారించాలని కోరారు. ఈ సమావేశం లో బాపట్ల ఎం పి నందిగం సురేష్, ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులకు సాధికార త కమిటీ నాయకులు సత్కరించారు.