శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (08:43 IST)

కృష్ణా జిల్లాలో కరోనా పరీక్షలు పెంచండి: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రిన్సిపాల్ సెక్రెటరీ

రాష్ట్ర సచివాలయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రిన్సిపాల్ సెక్రెటరీ డా. జవహర్ రెడ్డి కోవిడ్-19 నియంత్రణ చర్యలపై, కరోనా పరీక్షల తీరుపై సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి. కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) ఎల్.శివశంకర్,డియంహెచ్ఓ ఐ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో కరోనా సాoపిల్స్ సేకరణ, ప్రత్యేక బస్సులు ద్వారా టెస్టింగ్ నిర్వహణ తీరుపై జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్, ఇతర అధికార బృoదాన్ని అభినందించారు. రోజువారీ కరోనా పరీక్షలను 5 వేలకు పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జవహర్ రెడ్డి సూచించారు.

కాంటాక్ట్టా టెస్టింగ్ ఆఫ్ పాజిటివ్ కెసెస్, జిల్లాల వారీగా శ్యాంపుల్స్ పెండింగ్, పాజిటివ్ పేషంట్స్ విత్ ఔట్ ప్రైమరీ/ సెకండరీ కాంటాక్ట్స్, పాజిటివ్ కేసస్ నాట్ మ్యాప్పింగ్ టు క్లస్టర్స్, ఫీవర్ క్లినిక్స్ ఇన్ కంటైన్మెంట్ క్లస్టర్స్, ఐ.వి.ఆర్.ఎస్ ఫీడ్ బ్యాక్ ఆన్ కోవిడ్ హాస్పిటల్స్, ఐ.యం.ఏ రిపోర్ట్స్, ఫేస్ -5 ఫీవర్ సర్వే హౌస్ హోల్డ్ విజిట్స్, ఐ.యం.యస్ రిపోర్టు, ఫార్మసీ యాప్ వినియోగం, బ్యాక్ ఎండ్ మైగ్రేoట్ డేటా ఎంట్రీ, హోమ్ క్వారంటైన్ మానిటరింగ్, మెడికల్ ఆఫీసర్స్ యాప్, తదితర అంశాలను సమీక్షించి తగు సలహాలను, సూచలను తెలియజేశారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుతూ ప్రతి రోజు కనీసం 2500 పైగా పరీక్షలు నిర్వహిస్తున్న మన్నారు. కోవిడ్-19 పై ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశామన్నారు.

క్లస్టర్ మాపింగ్ కూడా పూర్తి అయ్యిందని వివరించారు. కరోనా కేసులకు వైద్యం అందించేందుకు మరిన్ని హాస్పిటల్స్ లో ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.