బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:48 IST)

తిరుపతి ఉప ఎన్నికకు పెరిగిన ఓటర్లు

గత రెండున్నరేళ్లలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్త ఓటర్ల సంఖ్య పెరిగింది. వీరికి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 15 నుంచి ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

ఈ మేరకు మార్చి 31వ తేది నాటికి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 4546 మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాలవారీగా.. తిరుపతిలో 280351 నుంచి 282342, శ్రీకాళహిస్తిలో 244824 నుంచి 247561, సత్యవేడులో 209884 నుంచి 210704కు ఓటర్ల సంఖ్య పెరిగింది.

ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను జిల్లా  యంత్రాంగం సిద్ధం చేసి రెండు రోజుల క్రితం నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు పంపింది. 
 
కొవిడ్‌ నిబంధనలను పాటిస్తు తిరుపతి ఉప ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాలను పెంచేందుకు జిల్లా  యంత్రాంగం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం మూడు నియోజకవర్గాలో 830 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అధనంగా 226  కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆమోదంతో కేంద్రాల సంఖ్య తాజాగా 1056కు పెరిగాయి.