గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (13:17 IST)

తిలక్ స్ఫూర్తి భారతీయులందరిలో ప్రతినిత్యం సజీవం : చంద్రబాబు

"స్వాతంత్ర్యం నా జన్మహక్కు" అని చాటిన "జాతీయోద్యమ పిత" బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తి భారతీయులందరిలో ప్రతినిత్యం సజీవం. వ్యక్తి స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం కోసం తిలక్ పరితపించారు. 
 
ఈరోజు తిలక్ జయంతి సందర్భంగా ఆ దేశభక్తుడు అందించిన స్ఫూర్తితో ప్రాథమిక హక్కుల పరిరక్షణ, పౌరహక్కుల సాధనే మనందరి లక్ష్యం కావాలి. అదే లోకమాన్యుడికి మనం అందించే నిజమైన నివాళి. ధైర్యసాహసాలకు మారుపేరైన చంద్రశేఖర్ ఆజాద్ జయంతి కూడా ఈరోజే. 
 
భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం ప్రాణాలనే తృణప్రాయంగా త్యజించిన విప్లవవీరుడు ఆజాద్. దేశభక్తిలో, పెత్తందారీతనం నిర్మూలనలో, రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో, సామాజిక స్ఫూర్తిలో చంద్రశేఖర్ ఆజాద్ ధైర్యసాహసాలే మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి.