శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (17:36 IST)

అల్లుడే మా బిడ్డ, మనువడిని చంపేశాడు.. వేరొక మహిళతో సంబంధం.. శశికళ ఏడుస్తూ చెప్పింది..

అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీని

అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ కాల్పులకు బలైన ఘటన మరవకముందే ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైయ్యారు. అయితే ఈ హత్యకు జాత్యహంకారంతో జరిగివుంటుందని అనుమానాలొచ్చాయి. అయితే తమ కుమార్తె, మనుమడిని అల్లుడే చంపేశాడని.. శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
కాగా ఈ హత్యపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. హనుమంతరావుకు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని శశికళ తమతో పలుమార్లు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిందన్నారు. వివాహేతర సంబంధం కారణంగా తమ బిడ్డను, మనువడిని హనుమంతరావు వేధింపులకు గురిచేశాడని.. ఆపై హత్య కూడా చేసేశాడని ఆరోపించారు.