సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (23:39 IST)

ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానం టైర్లు పేలిపోయాయ్...(Video)

తిరుపతి నుంచి శంషాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్లు పేలిపోయి మంటలు వచ్చాయి. దీనితో విమానం డోర్లు తెరుచుకోలేదు. ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికుల హాహాకారాలు చేశారు. ఫ్లైట్ అద్దాలు పగులగొట్ట

తిరుపతి నుంచి శంషాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్లు పేలిపోయి మంటలు వచ్చాయి. దీనితో విమానం డోర్లు తెరుచుకోలేదు. ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికుల హాహాకారాలు చేశారు. ఫ్లైట్ అద్దాలు పగులగొట్టి కిందికి దింపేయాలన్న ప్రయాణికులతో ఇండిగో సిబ్బంది వాదనకు దిగింది. 
 
ఫ్లైట్ దిగొద్దని ప్రయాణికులను వారిస్తున్న ఇండిగో సిబ్బంది. రెండు గంటలుగా ఫ్లైట్ లోనే బిక్కుబిక్కుమంటూ 120 మంది ప్రయాణికులు. పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదo. శంషాబాద్ విమానాశ్రయంలో తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానo, రన్ వేపై లాండింగ్ అవతున్న సమయంలో టైర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ విమానంలో ఎమ్మెల్యే, నటి రోజా కూడా వున్నారు. ప్రయాణికులందరూ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికీ విమానం డోర్లు తెరుచుకోలేదు. వీడియో చూడండి...