ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:16 IST)

బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్​ మూర్తి అల్లుడు

బ్రిటన్​లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది. దేశంలో రెండో అతిపెద్ద పదవైన ఆర్థిక మంత్రిగా రుషి సనక్​ నియమితులయ్యారు.

బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా సనక్ నిలిచారు. భారత సంతతికి చెందిన రాజకీయ నేత రుషి సనక్​ బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.

మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణలో భాగంగా బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. రుషికి చోటు కల్పించారు. బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్​ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తి రుషి సనక్​.

బ్రిటన్​ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిని దక్కించుకున్న రుషి.. ఇన్ఫోసిస్​ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు కావటం విశేషం.