బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:47 IST)

గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు కీలకం: జగన్

గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయడం అత్యంత కీలకమని, ఆ పని చేయని అధికారులకు మెమోలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్ధాయి తనిఖీలు ద్వారా పనితీరు సమర్ధత మెరుగుపడతాయన్నారు. కలెక్టర్లు వారానికి 2గ్రామ వార్డు సచివాలయాలు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పిఓ, ఐటిడిఎలు, సబ్‌కలెక్టర్లు వారానికి కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేయాలని సూచించారు.

కోవిడ్‌ నివారణలో సమిష్టి కృషి ఉందని చెప్పారు. థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియకపోయినప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగస్టు చివరి నాటికి జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్టాప్‌నర్సులకు పీడియాట్రిక్‌ కేర్‌లో శిక్షణ ఇవ్వని ఆదేశించారు.

విత్తనాలు, ఎరువుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీలు ఉండకూడదని సిఎం అన్నారు. కల్తీలు నిర్వహించే దుకాణాలపై కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు.
 
ధాన్యం బకాయిలు మొత్తాన్ని విడుదల చేస్తున్నామని, మొత్తం రూ.3,300కోట్లకు గాను, రూ.1800కోట్లు పది రోజుల క్రితమే చెల్లించామని మిగిలిన బకాయిలు కూడా విడుల చేస్తున్నామని సిఎం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా కొనుగోళ్లు
 
రూ.20వేలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డు బాధితులకు పరిహారం చెల్లింపులు ఆగస్టు 24న చేయనున్నట్లు సిఎం చెప్పారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం, 16న విద్యాకానుక, 27న ఎంఎస్‌ఎంఇలకు స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఇన్సెంటివ్‌లు చెల్లింపులకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు.