గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (09:53 IST)

జగనన్న పెట్టిన ఈ పథకంతో ప్రజలు వణుకుతున్నారు : అచ్చెన్న

‘జగనన్న గుంతల పథకం’తో రోడ్డెక్కాలంటేనే ప్రజలు వణుకుతున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీడియా సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ... అవినీతికి ప్రతిరూపాలుగా రాష్ట్రంలోని రోడ్లు ఉన్నాయని విమర్శించారు.

ప్రజలు గమ్యం చేరడానికి ముందే గతించేలా రోడ్లు తయారయ్యాయని, రెండేళ్లుగా రోడ్లకు మరమ్మత్తులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా..? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆరోపించారు.

జగన్ సర్కార్.. అవినీతి మత్తులో తేలుతూ.. ప్రజలను రోడ్లపైనే పడవల్లో తిరిగే పరిస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు వెంటనే బడ్జెట్ విడుల చేయాలని, రోడ్లపై ఖర్చు చేసిన సొమ్ముకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.