శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:48 IST)

వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లో ఇంటర్ ప్రవేశాలు

రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆన్​లైన్​లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించిందన్నారు.

బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ చట్టాలకు అనుగుణంగానే ఇంటర్​ కళాశాలలు పనిచేయాలని.. దానికి భిన్నంగా ర్యాంకుల పేరిట వ్యాపార ధోరణితో ముందుకు వెళ్తుండటం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

ప్రైవేటు, ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంటర్​ విద్యలో 70 శాతం కళాశాలలు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నాయని.. వాటి పనితీరులో లోపాలను సమావేశంలో మంత్రి ప్రస్తావించారు.

కోచింగ్‌ సెంటర్లు, ఇంటర్మీడియట్‌ కళాశాలలను కలపొద్దని స్పష్టం చేశారు. పరిమితికి మించి విద్యార్థులున్న కళాశాలలకు నోటీసులు ఇచ్చామని మంత్రి తెలిపారు.

నాణ్యత ప్రమాణాలతోపాటు ఫీజులు అందరికీ అందుబాటులో ఉండేలా ఫీజ్ రెగ్యులేటరీ కమిషన్ కళాశాలలను తనిఖీ చేస్తుందన్నారు.