సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (12:12 IST)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. ఎలా మొదలైంది?

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నేడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ (1999 నవంబర్ 17న) ప్రకటించింది. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెల్కో డైరక్టర్ జనరల్ ప్రకటిస్తున్నారు. ప్రపంచంలోని అన్నీ భాషలను రక్షించుకోవాలనే వుద్దేశంతోనే ఈ రోజును నిర్వహిస్తున్నారు. 
 
బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. మాతృభాషా దినోత్సవ ప్రకటన సదర్భంగా ప్రపంచంలోని అన్ని భాషలు సమానంగా గుర్తించబడ్డాయి. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి’ అని 2002లో ఈ సందర్భంగా యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ తన సందేశంలో తెలిపారు.