1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (15:34 IST)

తిరుపతిలో ఐటీ సోదాలు... కాంగ్రెస్ - వైకాపా నేతల్లో గుబులు!

it raids
ఏపీలోని తిరుపతి పట్టణంలో ఆదాయపన్ను శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా సోదాలకు దిగారు. తిరుపతి పట్టణంలోని డాలర్స్ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సంస్థ ఛైర్మన్ దివాకర్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాయన్న పక్కా సమాచారంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలకు దిగారు. 
 
కాగా, తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు, వారి బంధువుల ఇళ్లలో కూడా గురువారం ఈ ఐటీ సోదాలు జరిగిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్ళలో సోదాలు చేపట్టినట్టు కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. 
 
అలాగే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కె.లక్ష్మారెడ్డికి చెందిన గృహాలు, విల్లాలు, ఫామ్‌హౌస్‌లు, బాలాపూర్‌లోని బడంగ్ పేట్ మేయర్, పీసీసీ నేత, చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్ళలో ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు.