సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (22:21 IST)

తిరుమలలో గరుడ సేవ.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు

garuda seva in tirumala
తిరుమలలో గురువారం గరుడ సేవ జరుగనుంది. తిరుమల క్షేత్రంలో దసరా బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం స్వామివారికి సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. అలాగే గురువారం గరుడ సేవ జరుగనుంది. 
 
స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. శ్రీవారి వాహన సేవల్లో శ్రేష్ఠమైన గరుడ సేవను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమల చేరుకుంటారు. 
 
గరుడ సేవ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా అన్నీ ఏర్పాటు చేశామన్నారు.