శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (15:51 IST)

ఆరోపణలు కాదు.. దమ్ముంటే విచారణ జరిపించండి : ఐవైఆర్ సవాల్

తనపై ఆరోపణలు చేయడం మానుకుని దమ్ముంటే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సవాల్ విసిరారు.

తనపై ఆరోపణలు చేయడం మానుకుని దమ్ముంటే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని  మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సవాల్ విసిరారు. 
 
తనకు ప్రకాశం జిల్లా దొనకొండలో వందలాది ఎకరాల భూములు ఉన్నట్టు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై ఐవైఆర్ ఆదివారం స్పందించారు. ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి భూములూ లేవన్నారు. 
 
ఈ విషయంలో తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని,దమ్ముంటే రాయపాటి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజానిజాలను తేల్చాలని సవాల్ విసిరారు. 
 
తనకు భూములున్నట్టు రాయపాటి మాట్లాడటం పెద్ద అబద్ధమని అన్న ఐవైఆర్, అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజం చేయాలని అనుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆయనపై ఎలాంటి చర్య తీసుకుంటే ప్రభుత్వ విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు.