సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (17:02 IST)

అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా వుందని: మంత్రి వీరాంజనేయస్వామి

Minister Veeranjaneyaswamy
విజయవాడ నగరం నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పేరు కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు భారీ సైజులో వున్నదని, దాన్ని తొలగించాలని తమకు ఎన్నో వినతులు వచ్చాయని చెప్పారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఈ వినతులు వచ్చిన నేపధ్యంలో తాము ఒకసారి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని అనుకున్నట్లు చెప్పారు.
 
ఐతే ఈలోపుగా కడుపు మండినవారు జగన్ పేరును తొలగించి వుంటారనీ, అదేసమయంలో అంబేద్కర్ విగ్రహానికి గానీ, ఆయన పేరు వద్ద కానీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదన్నారు. జగన్ పేరు తొలగించడం ప్రభుత్వం పని అంటూ ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఇప్పటికే ప్రజలు వైసిపికి బుద్ధి చెప్పారనీ, ఐనా ఇంకా వాళ్లలో మార్పు కనబడటం లేదంటూ విమర్శించారు.