శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (15:30 IST)

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన కాలం రాసిన కథలు ట్రైలర్

Akash Jagannath's Unveiled kalam rasina kathalu Trailer
Akash Jagannath's Unveiled kalam rasina kathalu Trailer
ఎం.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కాలం రాసిన కథలు ఈ చిత్ర ట్రైలర్ ని పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది నటీనటులు కొత్తవాళ్లయిన పరిణితి చెందిన నటన కనబడుతుంది ముఖ్యంగా ట్రైలర్లో ఐదు కథల మధ్య ఉన్న లవ్ కంటెంట్ మరియు డైలాగ్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి దర్శకనిర్మత ఎంఎన్వి సాగర్ ఈ చిత్రాన్ని చాలా కాన్ఫిడెంట్గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కచ్చితంగా ఈ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు
 
 దర్శకనిర్మాత ఎం ఎన్ వి సాగర్ మాట్లాడుతూ నేను నా అభిమాన గురువుగా భావించే డేరింగ్ &  డాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ గారి తనయుడు ఆకాష్ జగన్నాథ్ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోయే ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా నేచర్ కి చాలా దగ్గరగా  ఉంటుంది  60 సంవత్సరాల తర్వాత పునర్జన్మలో ఊపిరి పోసుకున్న బంధాలు నమ్మకానికి మోసానికి మధ్య బలౌవుతున్న మనసు నలిగిపోయిన మనిషి జీవితాల్లో 30 సంవత్సరాల క్రితం మొదలైన పరువు హత్యల మధ్య ఈ కథ సాగుతుంది సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందించిన ఈ చిత్రం ద్వారా కొంతమంది నూతన తరులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు  సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులకి ఊహలకందని అద్భుతమైన ట్విస్టులు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి సినిమాలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి   ట్రైలర్ మరింత ఆకట్టుకుంటుంది  ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది 
 
తారాగణం: యమ్ యన్ వి  సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్ ,