శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (09:51 IST)

తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్య

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో జనసేన పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని సుహాన్ బాషాగా గుర్తించారు. బాషాను గుర్తు తెలియని వ్యక్తుల కొందరు దారుణంగా హత్య చేశారు. 
 
తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కొందరు బాషాపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. మృతుడు గాంధీపురానికి చెదిన సహానీ బాషాగా గుర్తించారు. 
 
ఈ హత్య గురించి సమాచారం అందుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక స్థానిక నేతలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దండుగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.