శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (16:56 IST)

మిత్రులారా... వెన్నునొప్పి ఇబ్బందిపెడుతోంది: జనసేనాని పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. గత కొన్నిరోజుల క్రితం ఆయన ఎన్నికల పర్యటన సమయంలో ఇబ్బందిపెట్టిన బ్యాక్ పెయిన్ మళ్లీ వచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ లేఖను ట్విట్టర్లో పెట్టారు.

చూడండి ఆయన మాటల్లోనే.. '' విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున, వ్యక్తిగతంగా నా తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. 
 
ఐతే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రచారం సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత మరింత పెరిగింది. 
 
డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సాంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కారణంగా గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనడంలేదు. ఐతే జనసేన తరపు నుంచి పార్టీ ప్రతినిధులు మీరు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం విజయవంతం కావాలాని ఆకాంక్షిస్తూ--- మీ పవన్ కళ్యాణ్''