Janasena Worker: జనసేన పార్టీ మీటింగ్‌కు వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. కారణం?
పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశం నుండి తిరిగి వస్తుండగా జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గా ప్రసాద్ మరణించారు. అమలాపురం నివాసి దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆకస్మికంగా మరణించినట్లు సమాచారం. ఆ కార్యకర్త మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"దుర్గా ప్రసాద్ మరణ వార్త నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.." అని పవన్ అన్నారు. దుర్గా ప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే, దుర్గా ప్రసాద్ మరణానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.