శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జులై 2024 (17:57 IST)

వైఎస్ విజయమ్మతో జేసీ భేటీ.. నెట్టింట ఫోటో వైరల్

JC Meets Vijayamma
JC Meets Vijayamma
జేసీ కుటుంబానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ ఎంట్రీతో.. ఆ బంధం కాస్త దూరంగా పోయింది. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి 46 సార్లు అరెస్టయ్యారనే విషయాన్ని గమనిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. 
 
కట్ చేస్తే, ఊహించని పరిణామంలో జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మను కలిశారు. విజయమ్మ పక్కనే ప్రభాకర్ రెడ్డి కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జగన్‌కు బద్ధ ప్రత్యర్థి అయిన జెసి ప్రభాకర్ రెడ్డితో విజయమ్మ ఉండటాన్ని జగన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఏపీలో జగన్ పార్టీ ఓటమిని చవిచూడటంతో టీడీపీకి చెందిన ప్రభాకర్ రెడ్డి పక్కన చిరునవ్వుతో విజయమ్మ కూర్చోవడం వైసీపీ అభిమానులకు ఏ మాత్రం ఇష్టపడట్లేదు.