శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మార్చి 2024 (16:15 IST)

ఎమ్మెల్యే సీటు వచ్చినా రాకపోయినా నా ప్రయాణం పవన్ కళ్యాణ్‌తోనే.. వినూత కోటా

vinotha kota
తనకు ఎమ్మెల్యే సీటు వచ్చినా రాకపోయినా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉంటానని, తన ప్రయాణం పవన్ కళ్యాణ్‌తోనేనని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన కీలక మహిళా నేత వినూత కోట ప్రకటించారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, తన నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల కోసం అనునిత్యం పోరాడుతానని, నా జనసైనికులకు, నాయకులకు, వీరమహిళలకి అండగా ఉంటానని, అందువల్ల ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు. పైగా, తన తుది శ్వాస వరకు తన ప్రయాణం పవన్ కళ్యాణ్‍‌తోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలతోనే కొనసాగుతుందన్నారు. 
 
తాను రాజకీయాల్లోకి ఇష్టపడి రాలేదని, పవన్ కళ్యాణ్ కోరిక మేరకు వచ్చానని తెలిపారు. వచ్చాక ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూసి! రాజకీయం ఖచ్చితంగా మారాలి మార్చి తీరాలనుకున్నా.. రాజకీయం ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక కుటుంబానికో పరిమితం కాకూడదని, ఈ వారసత్వ రాజకీయాలు పోవాలని, పోగొట్టాలని వచ్చి నిలబడినట్టు చెప్పారు. ఈ పాత వారసత్వ రాజకీయాలను మారుద్దాం అనుకున్నాం !! కానీ ఇప్పుడు మా నియోజకవర్గంలో మళ్లీ అదే జరుగుతుంటే చాలా బాధగా ఉందన్నారు. అయినప్పటికీ పిలుపు కోసం ఎదురుచూస్తానని వినూత కోటా ప్రకటించారు.