శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (13:23 IST)

శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నటిటిడి స‌భ్యుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు

టిటిడి బోర్డు మెంబ‌ర్ల ఎంపిక‌పై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుండ‌గా, స‌భ్యులు ఒక్కొక్క‌రు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాల‌లో వ‌రుస‌గా పాల్గొంటున్నారు. టీటీడీ బోర్డ్ సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు నియామ‌కం అయ్యారు. ఆయ‌న‌తో టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. రంగనాయక మండపంలో జూప‌ల్లి స‌బ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనంత‌రం జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నారు. స్వామివారి గోశాలను సందర్శించి స్వయంగా వెన్నను చిలికారు. టీటీడీ బోర్డు స‌భ్యుడిగా తిరిగి ఎంపిక కావ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని జూప‌ల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీవారి సేవ‌కు త‌న జీవితాన్ని అంకితం చేస్తాన‌ని ఆయ‌న భ‌క్తితో నివేదించారు.