శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 4 జులై 2018 (21:00 IST)

మోడి దరిద్రపు పాలసీలకు వ్యతిరేకంగా ఏకమవుతున్న ప్రతిపక్షాలు

అమరావతి: రాజకీయాల్లో ఉనికి కాపాడుకోడానికి దుమ్మెత్తి పోసే విధానం మంచిది కాదని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ

అమరావతి: రాజకీయాల్లో ఉనికి కాపాడుకోడానికి దుమ్మెత్తి పోసే విధానం మంచిది కాదని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర సంక్షేమం కోసం సూచనలు చేసే విధంగా ఉంటే స్వాగతిస్తామన్నారు. గతంలో తరిమెళ్ల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, మాధవరావు లాంటి కమ్యూనిస్ట్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడేవారన్నారు. 
 
దురదృష్టం ఈనాటి ప్రతిపక్ష వైసిపి నాయకులు తమది ఈ పాలసీ అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టాలని బిజెపి నాయకులు ఉత్సాహంగా మాట్లాడుతున్నారని అసలు రాష్ట్రపతి పాలన ఏ పరిస్థితుల్లో పెట్టాలో తెలుసా అంటూ ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్యెల్యే సునీల్ తనకు 40 కోట్ల రూపాయల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు బేరం పెట్టారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన ఆరోపణలు నిజం అయితే బేరం మాట్లాడినవారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 
 
అబద్దపు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తన గురువు రామచంద్రారెడ్డి ఎలా చెబితే అలా నడుచుకుంటానని సునీల్ అంటున్నారని ఆయన గురువు రామచంద్రారెడ్డి కాంట్రాక్టుల కోసమే రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు రామచంద్రారెడ్డి తత్వం అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మౌనంగా ఉండి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తనపై అసూయతో తనను ఓడించటమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయన్ని ఆరోపిస్తున్నారన్నారు. అయితే మోడిని ఓడించడం ప్రతిపక్షాల లక్ష్యం కాదన్నారు. మోడి దరిద్రపు పాలసీలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమౌతున్నాయని అన్నారు.