మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (10:29 IST)

ఇందిరమ్మను హిట్లర్‌తో పోల్చిన జైట్లీ.. చురకలు అంటించిన కాంగ్రెస్

మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి సోమవారానికి సరిగ్గా 43 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మాటల యుద్ధానిక

మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి సోమవారానికి సరిగ్గా 43 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మాటల యుద్ధానికి దిగింది. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ ఇందిరిమ్మను జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్, ఇందిర ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదు. 
 
కానీ అదే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారని మండిపడ్డారు. హిట్లర్ మెజార్టీ ప్రతిపక్ష సభ్యులను అరెస్ట్ చేసి తన మైనార్టీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీ సాధించేలా చేశారని వరుస ట్వీట్లు చేశారు. 
 
హిట్లర్ తరహాలోనే ఇందిరమ్మ కూడా ఆనువంశిక ప్రజాస్వామ్యంగా దేశాన్ని మార్చారన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశమంతా భయం గుప్పిట్లో చిక్కుకుందని, రాజకీయ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని అరుణ్ జైట్లీ గుర్తు చేశారు. 
 
మీడియాపై ఆంక్షలు విధించారని, అసమ్మతి నేతలను ముఖ్యంగా విపక్ష పార్టీల కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకున్నారనీ, అయినప్పటికీ వారు నిరంతర సత్యాగ్రహాలతో స్వచ్ఛందంగా అరెస్టయ్యారని మరో ట్వీట్‌లో జైట్లీ తెలిపారు. అయితే జైట్లీ జర్మనీ నియంత హిట్లర్‌తో ఇందిరాగాంధీని పోల్చడంపై కాంగ్రెస్ భగ్గుమంది. బ్లాగ్‌లకు రాసుకోవడం కాదు...ముందు మీరు పని చేయండంటూ చురకలు వేసింది.