శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (09:06 IST)

మీ డిమాండ్లు సబబుకాదు.. పాలు - మెర్సిడెస్ కారు ఒక్కటేనా : ప్రధాని మోడీ

'ఒకే దేశం ఒకే పన్ను' (వన్ నేషన్... వన్ ట్యాక్స్) అనే నినాదంతో ప్రారంభమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఆదివారంతో ఒక యేడాది పూర్తయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ డేను నిర్వహించింది. జీ

'ఒకే దేశం ఒకే పన్ను' (వన్ నేషన్... వన్ ట్యాక్స్) అనే నినాదంతో ప్రారంభమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఆదివారంతో ఒక యేడాది పూర్తయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ డేను నిర్వహించింది. జీఎస్టీ పన్ను విధానంపై ఆనేక రకాలైన విమర్శలు వచ్చినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.
 
ఈ నేపథ్యంలో జూలై ఒకటో తేదీని జీఎస్టీగా ప్రకటించిన కేంద్రం ఆదివారం మొదటి వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. జీఎస్టీ కింద అన్ని వస్తువులను కలుపడం సాధ్యం కాదని తెలిపింది. ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నట్లు అన్ని రకాల వస్తువులకూ ఒకే విధంగా 18 శాతం పన్ను విధిస్తే ఆహారం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉందని మోడీ తెలిపారు. 
 
ముఖ్యంగా, పాలకు, మెర్సిడెస్‌ కారుకు ఒకే విధమైన పన్ను వేయగలమా అని విపక్ష పార్టీల నేతలను ప్రశ్నించారు. దేశంలో ఇన్‌‌స్పెక్టర్‌ రాజ్‌‌ను తొలగించడం ద్వారా కేంద్రస్థాయిలోని ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ ట్యాక్స్‌ను, రాష్ట్రాల స్థాయిలో వ్యాట్‌ను కలిపి వేయగలిగామన్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ పన్ను విధానంలో మార్పులు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వాలు, సంఘాలు, ఇతర భాగస్వాముల సూచనలను పాటిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.