గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (15:14 IST)

బీజేపీ-జనసేన పొత్తుపై కేఏ పాల్ ఏమన్నారంటే?

బీజేపీ-జనసేన పొత్తుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అధికారమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అధికారం కోసమే పవన్ పార్టీ పెట్టారని.. ఈ విషయాన్ని తాను 2019 ఎన్నికలకు ముందే చెప్పినా ఎవ్వరూ నమ్మలేదన్నారు. శుక్రవారం తన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన పాల్ పవన్‌పై విమర్శలు గుప్పించారు. 
 
పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు చంద్రబాబుతో ఉండి ఆయన పలుకులు పలికి ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను చూస్తే విచారంగా ఉందన్నారు పాల్. 2008లో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ ఏజెంట్‌ని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.  ఓ ఎంపీ, మంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కూడా అధికారం కోసమే బీజేపీతో చేతులు కలిపారన్నారు. 
 
పవన్ ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్నారని మాయవతి ప్రధాని ఆయన ముఖ్యమంత్రి అవుదామని భావించారని ఫైర్ అయ్యారు. కానీ మోదీ అధికారంలోకి ఉన్నారని నడ్డా, అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని విరుచుకుపడ్డారు. రైతులకు న్యాయం జరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాలి.. ఎందుకు హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీకి చెప్పి ప్రత్యేక హోదా తీసుకొస్తే ప్రజలు ప్రశంసిస్తారన్నారు.